Header Banner

ఏపీలో టీచర్లు ప్రతి రోజూ అలా చేయకపోతే జీతాలు అకౌంట్‌లో వేయరా? విద్యాశాఖ కీలక ఆదేశాలు!

  Sun May 18, 2025 17:45        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 'లీప్' (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఒక సమగ్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం వేర్వేరు యాప్‌లు వాడేవారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, మన బడి- నాడు నేడు, పీఎంశ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా వేర్వేరు యాప్‌లు ఉండేవి. చాలా యాప్‌లు ఉండడం వల్ల వాటి ఐడీలు, పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం టీచర్లకు కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరు కోసం ఒక ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్‌బోర్డు అనే ఆరు విభాగాలు ఉన్నాయి.

ఈ లీప్ యాప్ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. లీప్ యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేసినట్లుగా.. ఆ రిపోర్ట్ ఆధారంగానే జీతం చెల్లిస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. 'రాష్ట్ర విద్యాశాఖ 'లీప్ యాప్' ద్వారా హాజరును తప్పనిసరి చేసిందని... హాజరు నివేదిక ఆధారంగా వేతనం లెక్కేస్తారని.. 'లీప్ యాప్'లో హాజరు నమోదు కాకుంటే, ఆ రోజుకు వేతనం కట్ చేస్తారని.. ఒక దినపత్రికలో వచ్చిన వార్త అబద్ధం. అలాంటి యాప్ ఏదీ లేదు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజలు కానీ ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు' అంటూ ట్వీట్ చేశారు.

'రాష్ట్ర విద్యాశాఖ లీప్ యాప్‌లో హాజరును తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ నిర్దేశించిన సమయాల్లో ఈ యాప్ ద్వారా హాజరు వేయాలని సూచించింది. ఈ లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగానే నెల జీతాన్ని కచ్చితంగా లెక్కించనున్నారు. యాప్‌లో హాజరు నమోదుకాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి జీతంలో కోత విధిస్తారు. ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ కార్యాలయ సిబ్బందికి పరిమితి చేయడగగా.. త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయనున్నట్లు సమాచారం' అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ లీప్ యాప్ అటెండెన్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాప్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.. అటెండెన్స్, జీతానికి సంబంధించి ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరిగితే సోషల్ మీడియా వేదికగా క్లారిటి తీస్తోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APTeachers #EducationDepartment #TeacherSalary #DailyAttendance #APNews #GovtOrders #TeachersUpdate